'చెరువుల అనుసంధానం ద్వారా ప్రతి చెరువుకు నీరు'

'చెరువుల అనుసంధానం ద్వారా ప్రతి చెరువుకు నీరు'

అన్నమయ్య: జిల్లాలో 'జలధార-జలహారతి' 100 రోజుల పనులను పక్కా ప్రణాళికతో నాణ్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువులను అనుసంధానం చేసి నీటి వినియోగాన్ని పెంచాలని తెలిపారు. పూడికతీత, ఆక్రమణల తొలగింపు, కాలువల శుభ్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.