హిందూ మతాన్ని మోదీ పట్టించుకోరు: రాహుల్
హిందూ మతాన్ని కానీ, ఆలయాలను కానీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శబరిమలలో జరిగిన బంగారం చోరీ అంశాన్ని ప్రధాని విస్తరించారని మండిపడ్డారు. అధికార పార్టీ LDF, BJP ఒక్కటిగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. BJPతో ఎవరు పోరాడినా వారిపై అటాక్ చేస్తుందని.. ఈ క్రమంలో తనపై 36 కేసు పెట్టిందని, 55 గంటల పాటు నిర్విరామంగా ప్రశ్నించిదని చెప్పారు.