అటహాసంగా వీడ్కోలు వేడుకలు
SKLM: విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, మానసిక ప్రశాంతత కోసం ఆటపాటల్లోనూ పాల్గొనాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం సంచాలకులు ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో జరుగుతున్న వీడ్కోలు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.