స్పెయిన్‌లో తిరుపతి కమిషనర్ మౌర్య
TPT: స్పెయిన్ బార్సిలోనాలో నిర్వహిస్తున్న 'ప్రపంచ స్మార్ట్ సిటీ కాంగ్రెస్ ఎక్స్పో' బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఎన్. మౌర్య, విశాఖ కమిషనర్ కేతన్ భార్గవ్, రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్ పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఎక్స్పోలో స్మార్ట్ సిటీల అభివృద్ధి, సాంకేతిక పరిష్కారాలపై చర్చలు నిర్వహించనున్నారు.