మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పూర్తి : కలెక్టర్

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పూర్తి : కలెక్టర్

WGL: వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నేడు ప్రశాంతంగా పూర్తయినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. వర్ధన్నపేటలో పాలకుర్తి సారంగపాణి ఛైర్మన్, నేతావత్ షిబారాణి వైస్ ఛైర్మన్‌గా, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి రామానంద్ ఛైర్మన్, గంధం నరేందర్ వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.