కొలను కాదు కళాశాలే

GDL: నీటి వలయంలో కన్పిస్తున్న ఇది అలంపూర్ ప్రభుత్వ కళాశాల. గురువారం తెల్లవారు జామున కురిసిన వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక ఇలా తయారైంది. కళాశాల పరిసరాలు, క్రీడాస్థలం తదితరాలన్నీ నీటితో నిండిపోయాయి, ఇదే పరిస్థితి ఉంటే విద్యార్థులకు అవస్థలు తప్పవని, నీరు సాపీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.