భూకబ్జా యత్నం కేసులో వ్యక్తి అరెస్ట్

భూకబ్జా యత్నం కేసులో వ్యక్తి అరెస్ట్

ASF: భూకబ్జా యత్నం కేసులో దుర్వా శంకర్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆసిఫాబాద్ CI వరప్రసాద్ తెలిపారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. మార్చి 29న శంకర్ తన అనుచరులతో కలిసి JCBతో భూమిలో చెట్లు తొలగించాడని, ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.