నగరంలో క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక నిధులు

నగరంలో క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక నిధులు

HYD: క్రిస్మస్ వేడుకలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని చర్చిలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఒక్కో డివిజన్‌కు రూ. 1 లక్ష చొప్పున కేటాయించారు. వీటితోపాటు ఒక్క చర్చికి విద్యుత్ దీపాలంకరణకు రూ. 30,000 ఇవ్వనున్నారు. దీనికోసం ఇప్పటికే పలు చర్చి పాస్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం నిధులు విడుదల చేయనున్నారు.