రామచంద్రపురం ఐటీడీఏ ఎదుట నిరసన

రామచంద్రపురం ఐటీడీఏ ఎదుట నిరసన

ELR: ప్రగతి శీల యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి మలాథిన్ స్ప్రే ను చేయించాలని డిమాండ్ చేశారు. దోమతెరలు పంపిణీ చేయాలన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలన్నారు