రైతుల సమస్యలను ప్రస్తావించిన ఎంపీ

రైతుల సమస్యలను ప్రస్తావించిన ఎంపీ

కోనసీమ: కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ భూసేకరణ అంశాలపై అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్ రైల్వే డిప్యూటీ రీజనల్ మేనేజర్, చీఫ్ ఇంజినీర్‌లతో చర్చించారు. విజయవాడలో గురువారం వారితో సమావేశమై, భూసేకరణ ప్రక్రియలో ఎదురైన లోటుపాట్లను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం వెంటనే చెల్లించాలన్నారు.