తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలి

తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలి

VZM: ప్రజలు తడి పొడి చెత్తలను వేరువేరుగా అందించాలని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి సూచించారు. శుక్రవారం గజపతినగరంలో జరుగుతున్న చెత్త సేకరణ పనులను ఎంపీడీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్తాచెదారాలను రహదారుల పైన కాలువల్లో వేయకూడదని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గజపతినగరం పంచాయతీ కార్యనిర్వాన అధికారి జి. జనార్దనరావు పాల్గొన్నారు.