క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి యువతి ఫిదా
క్యాబ్ డ్రైవర్ చూపిన ప్రేమ, అనురాగానికి ఓ యువతి సంతోషం వ్యక్తం చేసింది. ఆమె బెంగళూరులో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. తనకు ఆకలిగా ఉందని తన స్నేహితురాలితో ఫోన్లో చెప్పింది. ఆ మాటలు విన్న డ్రైవర్ శాండ్‌విచ్ ఇచ్చి 'నా అక్క ఆకలితో ఉంటే నేను చూడలేను.. అందుకే తీసుకువచ్చాను' అని అన్నాడు. ఈ విషయాన్ని చెబుతూ ఆ యువతి వీడియోను SMలో పోస్టు చేయగా వైరలవుతోంది.