విధులలో అంకితభావంతో పనిచేయాలి: SP
ADB: పోలీస్ సిబ్బంది విధులలో అంకితభావంతో పనిచేయాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఒక్క పోలీసు విధులలో యూనిఫామ్ ధరించాలని, నిజాయితీతో పని చేయాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.