కాలనీలో సంచరిస్తున్న కొండముచ్చులు
E.G: గోకవరం మండల కేంద్రంలో గల సంజీవయ్య నగర్ కాలనీలో గృహాల మధ్య కొండముచ్చులు సంచరిస్తున్నాయి. ఈ కొండముచ్చులు కారణంగా కాలనీలో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతే కాకుండా ఒంటరిగా వెళుతున్న మహిళలపై దాడులు చేస్తున్నాయి. కావున సంబంధిత అధికారులు కొండముచ్చుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.