బీజేపీని మరింత బలోపేతం చేయాలి: యడ్లపాటి

GNTR: భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపా రాణి సూచించారు. పట్టణంలో గురువారం జరిగిన సమావేశంలో బీజేపీ తెనాలి మండలం - 2 ప్రెసిడెంట్‌గా గోళ్ల దేవరాజును ఏకగ్రీవంగా ఎన్నుకుని అభినందించారు. జిల్లా నాయకులు వాసుదేవ నాయుడు, రామకృష్ణ, అనంతాచార్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.