3,500 ఎకరాల ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యం: కలెక్టర్

NZB: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్ష జరిపి కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు.