మోదీకి స్వాగతంగా శిల్పకారుల అద్భుత శిల్పం

GNTR: అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తెనాలి శిల్పకారులు ఓ ప్రత్యేక శిల్పాన్ని సిద్ధం చేశారు. కాటూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో 30 మంది కళాకారులు 20 రోజుల్లో నిర్మించిన ఈ శిల్పం "అమరావతి" అక్షరాలతో ప్రారంభమవుతుంది. దాదాపు 1,000 కిలోల లోహంతో రూపొందిన ఈ శిల్పంలో బుద్ధుడు, ఎన్టీఆర్ విగ్రహాలు ఇనుముతో, మోదీ విగ్రహం ఫైబర్ గ్లాస్‌తో రూపొందించారు.