గుండ్లగుంటపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
NGKL: ఊర్కొండ మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. సర్పంచ్ సీటు ఎస్టీ రిజర్వ్ కావడంతో రెడ్యా తండాకు చెందిన రమేష్ నాయక్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవాన్ని గ్రామస్థులు తీర్మానించారు. మొత్తం 8 వార్డులకు గాను ఇప్పటికే నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన వాటికి కూడా ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.