తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏఎస్పీ

తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఏఎస్పీ

NLG: దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ మౌనిక గురువారం పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ఎవ్వరు కూడా తప్పుడు ప్రచారం చేయవద్దని అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. తప్పుడు ప్రచారాలు ఎవరికైనా షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.