సోము వీర్రాజు సవాల్‌ను స్వీకరించిన ఉండవల్లి

AP: BJP MLC సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను మాజీ MP ఉండవల్లి అరుణ్‌కుమార్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. RSS సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్ చెబితే కచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ ప్రతి సవాల్ చేశారు. RSS సిద్ధాంతాలను తాను ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ చర్చ ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుస్తాయని ఉండవల్లి అన్నారు.