'పోలింగ్ సామాగ్రిని సక్రమంగా తరలించండి'
MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామాగ్రి సక్రమంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం అలీపూర్‌లో ఆయన పర్యటించారు. స్థానిక ఎంపీడీవోతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.