ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీధర్ హాస్పిటల్ ప్రారంభం

SKLM: నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదివారం శ్రీకాకుళం నగర పరిధిలోని కిమ్స్ హాస్పిటల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీధర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలతో తల్లి, పిల్లల హాస్పిటల్‌ను నెలకొల్పడం శుభపరిణామమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.