వరల్డ్ కప్‌-2005లో భారత్ ప్రస్థానం

వరల్డ్ కప్‌-2005లో భారత్ ప్రస్థానం

పెద్దగా అంచనాలు లేకుండానే 2005 వరల్డ్ కప్ బరిలోకి దిగిన మిథాలీ రాజ్ సేన అద్భుతంగా రాణించింది. లీగ్ స్టేజీలో న్యూజిలాండ్ చేతిలో ఓడినా.. తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. అయితే కంగారూల జోరు ముందు నిలవలేకపోయింది. టోర్నీలో మిథాలీ(199), అంజుమ్ చోప్రా(180) రాణించగా.. టాప్ 3 బౌలర్లు (నీతూ డేవిడ్-20, అమితా శర్మ-14, ఝులన్ గోస్వామి-13) మనోళ్లే కావడం విశేషం.