టీజీపీ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

టీజీపీ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

BHPL: మహాముత్తారం మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రక్క, టీజీపీ బ్యాంక్ మేనేజర్ సంతోష్‌ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేసింది. 2023లో తనకు మంజూరైన రుణాన్ని మేనేజర్, అతని అనుచరులు ఇతర ఖాతాలో జమ చేశారని ఆరోపించింది. మూడు నెలలు గడిచినా ఫలితం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది.