బేస్తవారిపేటలో ఘనంగా బాలల దినోత్సవం

బేస్తవారిపేటలో ఘనంగా బాలల దినోత్సవం

ప్రకాశం: బేస్తవారిపేటలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రంగనాయకులు, ఎమ్మార్వో జితేంద్ర పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నెహ్రూ‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని ఆయన పుట్టినరోజునే బాలల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు.