ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

SKLM: మనకు జీవితాన్ని, ప్రేమను, సంరక్షణను ప్రసాదించిన అద్భుతమైన మహిళ అమ్మ, అమ్మని మించిన దైవం మరొకటి లేదని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. రణస్థలంలో తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మాతృ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన తల్లికి పాదాభివందనాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.