అమరావతికి చట్టబద్ధత చారిత్రక ఘట్టం: ఎమ్మెల్యే

అమరావతికి చట్టబద్ధత చారిత్రక ఘట్టం: ఎమ్మెల్యే

ATP: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్యే బండారు శ్రావణి కొనియాడారు. ప్రజల త్యాగంతో నిర్మితమైన రాజధానిపై చట్టముద్ర పడటంతో ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు చిగురించాయన్నారు. అమరావతిని కదిలించడం ఎవరివల్లా కాదని, అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.