తిరుమల బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

TPT: ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని తిరుమల కొండపై వరకు పొడిగించింది. ఘాట్ రోడ్డు కావడం వల్ల సిటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. మంగళవారం అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను పరిశీలించిన ఆయన.. ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు రూ.6.30 కోట్ల లబ్ది చేకూరుతుందన్నారు.