VIDEO: పాత సింగరాయకొండలో మోస్తరు వర్షం
ప్రకాశం: పాత సింగరాయకొండలో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల ఉండొద్దని అధికారులు సూచించారు.