పాతగుంటూరులో వార్షిక తనిఖీలు నిర్వహించిన DSP
GNTR: ప్రజల భద్రత, సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ వార్షిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను గమనించి రిజిస్టర్, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కి వచ్చే వారి సమస్యలను సామరస్యంగా విని సత్వరమే పరిష్కరించాలని అన్నారు.