ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
మార్కాపూర్ ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి డీ. బాలాజీ నాయక్ కంభం మండలంలోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ వారికి తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మార్పీ ధరలు మించి ఎరువులు, పురుగుమందులు అమ్మరాదని దుకాణాదారులను హెచ్చరించారు.