మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

PDPL: పెద్దపల్లి జెండా చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి పట్టణ బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధాన్ని ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి యుద్ధానికి మద్దతు ఇవ్వాలన్నారు. దేశ భద్రత కోసం మోదీ నిర్ణయానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.