ఇంటి పన్నును బాధ్యతగా చెల్లించండి: డిప్యూటీ ఎంపీడీవో
ELR: ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లింపులో ప్రజలు బాధ్యతగా చెల్లించాలని ఉంగుటూరు ఎంపీడీవో పి.రమేష్ బాబు కోరారు. శనివారం ఉంగుటూరు మండలం నాచుగుంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్నును ఆయన పరిశీలించారు. మండలంలో ఇప్పటివరకు 63 శాతం ఇంటి పన్ను వసూలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారి నీలం ప్రసాద్ పాల్గొన్నారు.