రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

రెసిడెన్షియల్ స్కూల్‌ను  సందర్శించిన ఎమ్మెల్యే

JGL: మెట్‌పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను, బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులను, వంటశాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్రిన్సిపల్‌తో మాట్లాడిన ఆయన స్కూల్లో ఉన్న ఖాళీల వివరాలపై ఆరా తీశారు.