నర్వలో నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
NRPT: రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేడు నర్వ మండలంలో పర్యటించనున్నారు. సిపూర్, బెక్కరపల్లె, జక్కన్న పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం నర్వలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. తర్వాత బుద్దేగాని తండాలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.