VIDEO: హవేలీ ఆలయంలో ప్రత్యేక పూజలు
WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారికి పంచమృతాలతో అభిషేకం చేసి.. విశేషంగా అలంకరించారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.