వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు!

వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు!

అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. లఫాయెట్ పార్కు వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ వారాంతంలో వైట్‌హౌస్‌లో గడుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.