మార్చిలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు: సోమిశెట్టి

మార్చిలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు: సోమిశెట్టి

KRNL: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంగళవారం కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ గెలుపునకు ఆర్య వైశ్యులు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. మార్చిలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈసారి రాయలసీమ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.