రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

KKD: తుని, గుల్లిపాడు రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. మృతుడు నలుపు రంగు జర్కిన్ ధరించి ఉన్నాడని.. అతని వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.