కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్
KMM: రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని సర్పంచ్ ద్రౌపతి పేర్కొన్నారు. చింతకాని మండలం మత్కేపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మంగళవారం ప్రారంభించారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో, ఎకరానికి 26 క్వింటాళ్ల మేర ప్రభుత్వం కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగడాల పుల్లమ్మ ఉన్నారు.