జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన నూజివీడు విద్యార్థి

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన నూజివీడు విద్యార్థి

ELR: నూజివీడుకు చెందిన 8వ తరగతి విద్యార్థి డానియల్ నేష్ బాస్కెట్‌బాల్ అండర్–14 విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. మదనపల్లిలో జరిగిన రాష్ట్ర పోటీల్లో కృష్ణా జిల్లా తరఫున మెరుగైన ప్రతిభ చూపడంతో ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 23–28 వరకు జబల్పూర్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నాడు.