రహదారుల అభివృద్ధికి రూ.13.40 కోట్లు మంజూరు

WG: జిల్లాలో పలు రోడ్లు అభివృద్ధికి రూ.13.40 కోట్లు నాబార్డు నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం తెలిపారు. జిల్లాలో 37,020 కిలో మీటర్ల మేర రహదారుల అభివృద్ధికి రూ.1,340 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి రహదారి పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.