FLASH: మరోసారి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఫుట్‌బాల్ ఆడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శాసనసభ్యుల క్రీడల పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫుట్‌బాల్ ఆడటంతో, అక్కడే ఉన్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ.. చప్పట్లతో అభినందించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యులు నేడు, రేపు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు.