'బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత'

ADB: తరోడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. 5 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. మే నెలలో జరిగిన విషాద సంఘటన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సహాయ నిధి కింద కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగించడం జరిగిందని తెలిపారు.