బీజేపీ మండల అధ్యక్షుడిగా అడుప రాజు
WGL: వర్ధన్నపేట మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడిగా అడుప రాజును అధికారికంగా నియమించారు. జిల్లా అధ్యక్షుడు గంట రవి మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ స్థానిక స్థాయిలో మరింత బలోపేతం కావాలని, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.