'బడిబాట.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి'

'బడిబాట.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి'

RR: కేశంపేట మండలం నిర్దివెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, మధ్యాహ్నం భోజనం, డిజిటల్ తరగతుల వంటి సౌకర్యాలు వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.