VIDEO: 'ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కృషి చేయాలి'
SKLM: ఆమదాలవలసలోని ఓ కళ్యాణ మండపంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు NTR చేసిన సేవలను ఆయన కొనియాడారు. అలాగే, ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.