వర్షిత కుటుంబ సభ్యులు పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు
KNR: హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థిని వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శుక్రవారం పరామర్శించారు. ఇప్పటివరకు అధికారులు, పోలీసులు విచారణ చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే చొరవ తీసుకుని న్యాయం జరిగే విధంగా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.