పోరంకిలో చంద్రబాబు జన్మదినోత్సవం
కృష్ణా: ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA బోడె ప్రసాద్ కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే కొనియాడారు. హైదరాబాదు అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.