135 పాల సంఘాలకు బోనస్‌ చెక్కుల పంపిణీ

135 పాల సంఘాలకు బోనస్‌ చెక్కుల పంపిణీ

కృష్ణా: బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్‌లో బుధవారం రాత్రి మొదటి విడత 10% బోనస్‌ చెక్కుల పంపిణీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,79,77,852ల విలువైన చెక్కులను 135 పాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అందజేశారు. ఫీడ్ కమిటీ సభ్యులు పిన్నమనేని లక్ష్మీప్రసాద్, క్లస్టర్ మేనేజర్ మాగంటి హరిబాబు పాల్గొన్నారు.